Srimukhi

శ్రీముఖి యాంకర్ గా ఎంత టాలెంటెడ్ అనేది మనకు తెలుసు. ఆమె తన యాంకరింగ్ టాలెంట్ మరోసారి కొత్త షో ద్వారా చూపించబోతోంది. శ్రీముఖి ఓహ్ వుమెనియా అనే కొత్త టాక్ షో ప్రారంభించబోతోంంది. ఇందులో మహిళా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయబోతోంది. ఓహ్ వుమెనియా టాక్ షో ఫస్ట్ లుక్ ప్రోమో సాంగ్ బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో శ్రీముఖి తన గ్లామర్ చూపించింది. ఒక మహిళ వివిధ దశల్లోని గెటప్ లతో కనిపించింది. స్కూల్ , కాలేజ్ విద్యార్థినిగా, ఒక టీనేజ్ అమ్మాయిగా, ఉద్యోగినిగా, ఇల్లాలిగా ఇలా…ఐదు రకాల గెటప్ లతో సాంగ్ ప్రోమోలో ఆకట్టుకుంది శ్రీముఖి.

Also Read: రష్మీ గౌతమ్ న్యూ లుక్ అదుర్స్..

Image

ఈ పాటకు యామినీ ఘంటసాల సంగీతాన్ని అందించగా, అనీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. శ్రీముఖి నిర్మాతగా వ్యవహరించింది. ఈ షో డీటెయిల్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ సాంగ్ రూపకల్పనలోనూ మహిళలే ఎక్కువగా పనిచేయడం విశేషం.