Sumalatha

Sumalatha : తెలుగు, తమిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ‌ భాష‌ల‌లో క‌లిపి 200కు పైగా సినిమాలు చేసిన న‌టి సుమ‌ల‌త‌. 1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి, ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గి ఆ తర్వాత తన 15వ యేట సినీ రంగంలో ప్రవేశించింది. ఆరుభాష‌ల‌లో అవ‌లీల‌గా మాట్లాడ‌గ‌లిగిన‌ సుమ‌ల‌త తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, బాపు దర్శకత్వం వహించిన ‘రాజాధిరాజ చేసింది . డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.

Also Read: రూటు మార్చిన మలయాళీ కుట్టి

Sumalatha Ambareesh tests positive for COVID-19 | Kannada Movie News - Times of India

అంబ‌రీష్ మ‌ర‌ణించిన త‌ర్వాత కర్నాటక రాష్ట్రంలోని మాండ్య నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా విజయం సాధించింది సుమ‌ల‌త‌. ఇప్పుడు ఆమె జీవితంకు సంబంధించి బ‌యోపిక్‌ను రూపొందించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. దర్శక–నిర్మాత గురుదేశ్‌ పాండే ఇటీవల సుమలతని కలిసి బయోపిక్‌ గురించి చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. 10 నుండి 15 ఎపిసోడ్స్‌గా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా, ఇందులో సుమ‌ల‌త సినీ, రాజ‌కీయ జీవితాల‌ని చూపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *