Tejaswi madiwada commitment new bold teaser

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు తేజస్వి మదివాడ… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సమంతకు చెల్లెలిగా కనిపించిన తేజస్వి.. ఆ తరవాత పలు చిత్రాల్లో మంచి పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో తేజస్వి క్రేజ్ బాగా పెరిగింది. అయితే, బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత తేజస్వి అవకాశాలు లేక కాస్త ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో ఆమెకు వచ్చిన అవకాశం ‘కమిట్‌మెంట్’.

Also Read: సానియా మీర్జా నటిగా మారనుందా?

తేజస్వీ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలపై జరిగే దారుణాలపై మాట్లాడింది. సినిమా ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిగా వచ్చిన నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఫస్ట్.. తెలుగమ్మాయి అనగానే తీసిపాడేస్తారని సంచలన కామెంట్స్ చేసింది. తెలుగమ్మాయి కాబట్టి కమిట్‌మెంట్ అడగడం ఈజీ అయిపోతుందని తేజస్వీ చెప్పింది.హిందీ అమ్మాయిలను అయితే మేనేజర్ల సహాయంతో కాస్త కష్టపడాలి అని.. తెలుగమ్మాయిని కాబట్టి నన్ను డైరెక్ట్‌గా అడిగేసేవారని తనకు ఎదురైన ఘటనల గురించి చెప్పుకొచ్చింది. అలాంటి కమిట్‌మెంట్‌లు, అలాంటి వ్యక్తులను తప్పించుకుని వచ్చానని తేజస్వీ పేర్కొంది.

Also Read: తరుణ్‌తో ప్రేమాయణం..క్లారిటీ ఇచ్చిన ప్రియమణి

చాలా పెద్ద పెద్ద దర్శకులతో పనిచేశానని.. చాలా చోట్ల ఇబ్బందికరంగా ఫీలయ్యానని తేజస్వీ తెలిపింది. తన స్టోరీని జనాలకు చెప్పే అవకాశం రాలేదని, అందుకే దేవుడు ఈ సినిమాను తనకు ఇచ్చాడని చెప్పుకుంది. ఇది కచ్చితంగా తన లైఫ్ స్టోరీనే అని బలంగా చెప్పింది. ఈ స్థాయికి రావడానికి తానెంత ఫైట్ చేశానో ఈ సినిమా చెబుతుందని తేజస్వీ తెలిపింది.

Also Read:ఆ రెండు సినిమాల పై అనూ ఇమ్మాన్యుయేల్‌ ఆశలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *