trisha in tamil Jersey remake

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `జెర్సీ`. క్రికెట్ నేపథ్యంలో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం పలు భాషల్లోకి రీమేక్ అవుతోంది.  హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో యంగ్ హీరో విష్ణు విశాల్ కథానాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే విష్ణు విశాల్‌కు జోడీగా, ఓ బాబుకి తల్లిగా కనిపించే హీరోయిన్ పాత్రలో నటించడానికి ఎవరూ ముందుకు రాలేదట. నయనతార, అమలా పాల్ కూడా ఈ పాత్రను తిరస్కరించారట. చివరకు సీనియర్ హీరోయిన్ త్రిష ఈ పాత్ర చేసేందుకు అంగీకరించిందట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతోందట.

Also Read: నేను ఎవరి లైఫ్ లోకి అయినా ఎంట్రీ ఇస్తే … లాభాలే..

Image: instagram/trishakrishnan

ప్రస్తుతం త్రిష కి మూడేళ్ల క్రితం అరవింద్ స్వామితో కలసి చేసిన సినిమాకి ఇప్పుడు మోక్షం వచ్చినట్టు కనిపిస్తోంది. రిలీజ్ కోసం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న ‘శతురంగ వెట్టయ్ -2’ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ అయ్యేందుకు మార్గం సుగమం అయింది. తాజాగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి రేటు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకుంది.