Vaani Kapoor

‘ఆహా కల్యాణం’ తో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ వాణీకపూర్. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఆమెకు మరో ఛాన్స్ దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కే పరిమితమైన ఈ పొడుగుకాళ్ల సుందరి ‘బేఫికర్‌’, ‘వార్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ సరసన ‘బెల్ బాటమ్’ చిత్రంలో నటిస్తు్న్న వాణీకపూర్.. . జాతీయ అవార్డు గ్రహీత ఆయుష్మాన్ ఖురానా సరసన `చండీగర్ కరే ఆషికి` అనే సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాణీ కపూర్ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ఓ ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడతాడట. ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన వాణీకపూర్ తొలిసారి ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనుందట. ఇప్పటివరకు హీరోలే ట్రాన్స్‌జెండర్‌గా కనిపించగా.. తొలిసారి ఓ హీరోయిన్‌ అలాంటి పాత్ర చేయడం సాహసమనే చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *