vakeel saab motion poster

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ … అభిమానులను మరింతగా ఉత్సాహపరిచేందుకు, అభిమానులకు కానుకగా పవన్‌ తాజా చిత్రం వకీల్‌ సాబ్‌ ఫస్ట్ లుక్ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. బాలీవుడ్ సూపర్ హిట్ అయిన పింక్‌ సినిమాకు రీమేక్‌గా వకీల్ సాబ్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ అమితాబ్‌ పోషించిన పాత్రలో తెలుగులో పవన్‌ నటిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.తాజా రిలీజ్ చేసిన మోషన్‌ పోస్టర్‌తో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు చిత్రయూనిట్..

Also Read: పవన్‌ కళ్యాణ్‌కు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!