inter-state passenger movement is further liberalised in ap

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోజూ 10వేల దాకా కరోనా పాజిటివ్ కేసులొస్తున్నాయి. అయినప్పటికీ… ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఏపీకి వెళ్తున్నారు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఐతే… కేంద్ర హోంశాఖ… ఆగస్ట్ 1 నుంచి అన్‌లాక్ 3 ప్రారంభించడంతో… రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన కండీషన్లను కాస్త తేలిక చేస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్లేవారు… జస్ట్ స్పందన వెబ్‌సైట్‌ లో తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ-పాస్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అది వారి మొబైల్, ఈమెయిల్‌కి వచ్చేస్తుంది. తమ మొబైల్‌ లేదా ఈమెయిల్‌కి వచ్చిన ఈ పాస్‌తోపాటూ… ఏపీకి వెళ్లేవారు సరైన ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు దగ్గర పోలీసులు ఆపి… ఈపాస్, ఐడీ చూపించండి అనగానే… సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ… అవి చూపిస్తే చాలు… ఓకే అంటూ లోపలికి అనుమతిస్తారు.

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్... ఇకపై అక్కడ ఆ టెన్షన్లు ఉండవు...

ఇదివరకు ఈ-పాస్ రావడానికి టైమ్ పట్టేది. ఇప్పుడు అలా కాదు. వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి… ఏపీకి వెళ్లాలనుకునేవారికి ఈ తలనొప్పి లేనట్లే. ఇక ఏపీలోకి వెళ్లాక…. హెల్త్ చెకప్స్ ఉంటాయి. అక్కడి హెల్త్ స్టాఫ్… ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేస్తారు. మొత్తంగా ఆగస్ట్ 2 నుంచి ఇలా ఆటోమేటిక్ ఈ-పాస్ లభించనుందని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు తెలిపారు. అందువల్ల ఏపీకి వెళ్లాలనుకునేవారు… వేవంగా ఈపాస్ ఏర్పాటు చేసుకొని వెళ్లవచ్చని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *