anantapur kisan rail

అనంతపురం టు ఢిల్లీ కిసార్ రైలు కదిలింది. రైతులు పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బుధవారం ఢిల్లీకి ప్రత్యేకంగా ‘కిసాన్‌ రైలు’ ప్రారంభమైంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నా.. కరోనా ప్రభావంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇబ్బందులు వచ్చాయన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో రైతులు పండించే మొత్తం పంటలో.. రాష్ట్రమంతా కలిపి 10 నుంచి 15 శాతం వినియోగమే ఉంటుందని.. దక్షిణ భారతంకు ఏపీ పండ్ల ఉత్పత్తి కేంద్రంగా ఉందన్నారు.

Also Read: ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ ట్రయల్స్ కి తాత్కాలికంగా బ్రేకులు …

Boost for farmers! Indian Railways to run first Kisan Rail special service  between Maharashtra-Bihar; details - The Financial Express

కిసాన్ రైలులో రైతులు ఉద్యాన పంటలు, కూరగాయలు, పూలు రవాణా చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో పండించే ఉద్యాన పంటలను కొందరు రైతులు ఇప్పటికే రోడ్డు మార్గాన ఢిల్లీ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అనంతపురం నుంచి ఢిల్లీ 2,190 కిలోమీటర్లు.. లారీల్లో రవాణాకు 4-5 రోజులు పడుతోంది. అదే కిసాన్‌ రైలులో 36 గంటల్లోనే మార్కెట్‌కు ఉత్పత్తులు చేరుతాయి. లారీల్లో తీసుకెళ్లితే పండ్లు పాడైపోతాయి. వాటి నాణ్యత తగ్గుతోంది. సరైన ధర కూడా రావడం లేదు. ఒక లారీ దిల్లీకి వెళ్లొస్తే భారీగా ఖర్చు అవుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైలులో అయితే సమయం ఆదా అవుతుంది. పండ్లు దెబ్బతినవు. రవాణా ఖర్చు కూడా తక్కువే.

Also Read: అన్నం తింటే డయాబెటిస్ రావడం ఖాయమా?