ap unlock 4 new guidelines

ఈనెల 30 వరకు విద్యా సంస్థలన్నీ మూసే ఉంటాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా ఇతర ప్రాంతాల్లో 9,10 తరగతి విద్యార్థులు, ఇంటర్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయితే సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు మాత్రం అనుమతి ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరు బయటకు వెళ్లే మాస్క్‌లు ధరించాలని, అంతేకాకుండా భౌతిక దూరం తప్పనిసరి అంటూ పేర్కొంది.

AP Government Issued Unlock Guidelines - Sakshi

ఏపీ అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు :

– సెప్టెంబర్‌ 21 నుంచి 9,10, ఇంటర్‌ విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లవచ్చు
– ప్రాజెక్టులు, పరిశోధనల కోసం పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి
– సెప్టెంబర్‌ 21 నుంచి 100 మంది మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్‌, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి
– సెప్టెంబర్‌ 20 నుంచి 50 మంది అతిథులతో పెళ్లి వేడుకలు నిర్వహించుకోవచ్చు . అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి ఉండకూడదు
– సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులకు ఎలాంటి అనుమతి లేదు
– 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి