bigg boss4 telugu

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. బిగ్ బాస్ సీజన్ 4, సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కాబోతుంది. ఇదే విషయమై తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులు ఓ ప్రోమో విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3ని విజయవంతంగా నిర్వహించిన హీరో నాగార్జున హోస్ట్‌గా రానున్నారు. ముందు సీజన్స్ లాగే ఈ సీజన్‌లో కూడా బిగ్ బాస్ టీం సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా రంగాల నుండి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి డాన్స్ …

Bigg Boss Telugu Season 4: Rumoured List of Contestants

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఈ షోలో టీవీ-9 దేవి, కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ దంపతులు, మై విలేజ్‌ షో గంగవ్వ, జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్‌ నోయల్‌ సేన్‌, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్‌ బజ్వా, పూజిత పొన్నాడ, యాంకర్లు లాస్య, అరియానా, యూట్యూబరర్లు అలేఖ హారిక, మహబూబ్‌ దిల్‌సేలు కంటెస్టెంట్లుగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నిర్వాహకులు ప్రోమోను సైతం విడుదల చేసేశారు. నాలుగో సీజన్‌కు మరోసారి మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా చేయనున్నారు. అయితే నాగార్జున ఈ సారి భిన్నంగా మూడు గెటప్ప్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

Also Read: ఎర్రచీరలో జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్