case against sadineni yamini

ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామిని టీటీడీపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ వ్యాఖ్యలను టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. ఆమెపై టీటీడీ విజిలెన్స్ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఐపీసీ 505(2), 500 సెక్షన్ల కింద యామినిపై కేసు నమోదు చేశారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌లో రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని యామిని విమర్శలు చేశారు. ఈ పరిణామం హిందువులను మనోవేదనకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు. హిందువులు ఇచ్చే కానుకలు, దానాలతో నడిచే టీటీడీ ఈ రకంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యామినిపై కేసు నమోదైంది.

Also Read: ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ కరోనా

TDP Spokeswoman - Who is Yamini Sadineni?

అయోధ్య రామమందిర శంకుస్థాపన సమయంలో ఎస్వీబీసీలో కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారమవుతోందని వివరణ ఇచ్చింది. కల్యాణోత్సవ సేవా కార్యక్రమాన్ని ఎంతో మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారని టీటీడీ తెలిపింది. కల్యాణోత్సవం కార్యక్రమం సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చేయడం లేదని స్పష్టం చేసింది. ఆ కార్యక్రమాన్ని మరుసటి రోజు ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్నామని టీటీడీ తెలిపింది.