common voter list

లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్ని లక్ష్యంలో భాగంగా దేశమంతటా ఒకే ఓటర్ జాబితా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాలకు మొదట నచ్చచెప్పి ఒప్పించాలని సాధ్యం కాకపోతే రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని సార్వత్రికంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇన్నేళ్లూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ తయారు చేసిన జాబితా, మునిసిపల్‌, కార్పొరేషన్‌, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్‌ఈసీ)లు సిద్ధం చేసిన జాబితాలను విడివిడిగా వాడుతున్నారు. అనేక రాష్ట్రాలు ఈసీ జాబితాలనే స్థానిక ఎన్నికలకూ ఉపయోగిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రాలు తమ సొంత లిస్టులను తయారుచేసుకుంటున్నాయి.

Also Read: అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

Centre racks up efforts to implement 'One Nation, One Election' policy - DKODING

దేశమంతా ఒకే ఓటరు లిస్టు ఉండేట్లుగా రాజ్యాంగంలోని 243కే, 243 జెడ్‌ఏలను సవరించడం. 2 ఈసీ తయారు చేసే జాబితాలనే స్థానిక ఎన్నికలకూ వాడండని రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చచెప్పడం. ప్రధాని ప్రిన్సిపల్‌ కార్యదర్శి పీకే మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, లెజిస్లేటివ్‌ కార్యదర్శి జి నారాయణరాజు, పంచాయతీరాజ్‌ కార్యదర్శి సునీల్‌ కుమార్‌, ఈసీ సెక్రటరీ జనరల్‌ ఉమేశ్‌ సిన్హా సహా మరో ముగ్గురు అధికారులు, లా కమిషన్‌ అధికారులు పాల్గొన్నారు.