corona cases in telangana

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2932 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 11 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 799కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 33,439 శాంపిళ్లను సేకరించగా, 771 శాంపిళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,17,415 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 28,942 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read: తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి

COVID-19 Telangana News: Number Of Coronavirus Cases In Telangana Crosses 1  Lakh: State Report

అత్యధికంగా నమోదైన ప్రాంతాలివే..

జీహెచ్‌ఎంసీ పరిధిలో – 530
మేడ్చల్‌ -218
రంగారెడ్డి – 218
కరీంనగర్‌ 168
నల్గొండ – 159
నిజామాబాద్‌ – 129
ఖమ్మం – 141
మంచిర్యాల – 1118
జగిత్యాల – 113
సూర్యాపేట – 102
సిద్దిపేట – 100
ఇక ఇతర జిల్లాల్లో వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.