coronavirus on spectacles

తాజాగా కండ్లద్దాలపై కూడా కరోనా వైరస్ 9 రోజుల పాటు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కళ్లజోడు వాడేవారు బయటకు వెళ్లి వచ్చినప్పుడు వాటిని కచ్చితంగా శుభ్రం చేయాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. ‘మాస్కులతో నోరు, ముక్కును కవర్‌ చేసుకున్నట్లుగానే కండ్లను కవర్‌ చేయడానికి అద్దాలు అంతే అవసరం. కండ్లద్దాలపై వైరస్‌ 9 రోజుల వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అందుకే వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలని హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలోని కంటి వైద్య నిపుణుడు అక్షయ్‌ తెలిపారు. అయితే కండ్లద్దాలను ఆల్కహాల్‌ శానిటైజర్లతో శుభ్రం చేయవద్దని, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వాడితే మంచిదని ఆయన సూచించారు.

Also Read: మానసికంగా బలపడితే కరోనాపై విజయం : వైద్యుల సూచన

An Open Letter About the Coronavirus From an Optical Employee to Her  Business's Customers | INVISIONMAG.COM

ఇప్పటికే కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు యునిసెఫ్ కొన్ని సూచనలు చేసింది. వైరస్ ఎక్కడ, ఎంత సేపు బతుకుతుందో తెలిపింది. కరోనా గాలి నుంచి సోకదు. వస్తువులపై మాత్రమే ఉంటుందని పేర్కొంది. వైరస్ అంటిన వస్తువులను ముట్టుకుని నోరు లేదా ముక్కు దగ్గర చెయ్యి పెడితేనే వైరస్ అంటుతుందన్నారు. వస్తువుల మీద ఉన్న వైరస్ బతికేది కేవలం 12 గంటలే. నీళ్లు, సబ్బుతో కడిగితే వైరస్ పోతుందని యూనిసెఫ్ ప్రతినిధులు తెలిపారు. బట్టలపై 9 గంటల పాటు వైరస్ బతుకుతుంది. రెండు గంటలు ఎండలో ఆ బట్టలను పెడితే వైరస్ చచ్చిపోతుందన్నారు.  (News Source: Samayamtelugu)