Harishrao Tested Corona Positive

చిన్నా-పెద్దా, పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరికీ ఈ మహమ్మారి సోకుతోంది కరోనా. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా మంత్రి హ‌రీష్ రావుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేర‌కు ఆయ‌న క‌రోనా సోకిన‌ట్లుగా ట్వీట్ చేశారు. కరోనా లక్షణాలు క‌నిపించ‌డంతో వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో హోం క్వారంటైన్ అయ్యాను. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. గ‌డిచిన కొద్ది రోజులుగా న‌న్ను కాంటాక్ట్ అయిన వారంద‌రు టెస్టులు చేయించుకోని త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోగ‌ల‌ర‌ని హ‌రీష్‌‌రావు ట్వీట్‌లో కోరారు.

Also Read: ఇప్పట్లో కరోనా టీకా డౌటే !

Harish Rao Review Meeting At Medak Over Rice Grain Purchase

ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తంగా 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,38,395 కేసులు నమోదు కాగా, మొత్తం 877 మంది మృతి చెందారు.