high court fires on telangana govt

కరోనా లెక్కల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరస్ సోకిన రోగులు, మరణాల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని అభిప్రాయపడింది. కరోనా కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండడం పట్ల హైకోర్టు ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. మార్చి 31 నుంచి ఇప్పటి వరకు కేవలం రోజుకు 8 లేదా 9 లేదా 10 మంది మాత్రమే కరోనా వల్ల చనిపోతున్నారని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. రోజుకు ఏక సంఖ్యలోనే మరణాలు సంభవిస్తున్నాయా అని ప్రశ్నించింది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.

Also Read: రూ.10కే కిలో చేపలు… అయినా కొనేవాళ్లు లేరట…

https://www.photojoiner.net/image/tLYryU1s

రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ నిర్లిప్తత, ప్రైవేటు దోపిడీ కట్టడి విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజారోగ్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో చెప్పాలని పిటిషనర్ కోరగా, దీనిపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని కోరింది. ఈనెల 22లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తప్పుడు నివేదికలు కనుక సమర్పిస్తే చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.