India Unemployment Rate

మన దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా ‌ మహమ్మారి వ్యాప్తి మరింత పెరుగుతున్న ఈ తరుణంలో ఇది మరింత ఆందోళనకు దారితీస్తోంది. పట్టణాల్లోని సంప్రదాయ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కోత, వ్యవసాయరంగంలో ఉపాధి శాచురేషన్‌ పాయింట్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం పెరుగుదలకు కారణమవుతోంది. జూలైలో 7.43 శాతమున్న నిరుద్యోగ శాతం కాస్తా ఆగస్టు చివరినాటికి మొత్తంగా 8.35 శాతానికి చేరింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ భూ తం మరింత ఎక్కువగా భయపెడుతోంది. ఇటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగానే నిరుద్యోగమున్నా అక్కడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగస్టులో పట్టణ ప్రాంతాల్లో 9.83 శాతం, గ్రామాల్లో 7.65 శాతం నిరుద్యోగం రికార్డయింది. అదే జూలై నెలలో పట్టణాల్లో 9.15 శాతంగా, గ్రామాల్లో 6.66 శాతంగా ఉంది. మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రతీ పది మందిలో ఒకరికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని తెలుస్తోంది.

Also Read: రైతుల ఆత్మహత్యల్లో తెలుగు రాష్ట్రాలు ?

unemployment rate: India's unemployment rate continues to hover above 24% -  The Economic Times

దేశంలోని నెలవారీ నిరుద్యోగ శాతానికి సంబంధించిన వివరాలను సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. కోవిడ్‌ పరిస్థితుల్లో తలెత్తిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని సంప్రదాయ, వ్యవస్థీకృత రంగాల్లో (ఫార్మల్‌ సెక్టార్‌) ఉద్యోగ, ఉపాధి తగ్గిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. హరియాణాలో అత్యధికంగా 33.5 శాతం నిరుద్యోగం నమోదు కాగా, కర్ణాటకలో అత్యల్పంగా 0.5 శాతమే రికార్డయింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 5.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం నిరుద్యోగమున్నట్టుగా సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు..

1. హరియాణా–33.5 శాతం
2.  త్రిపుర–27.9 శాతం
3. రాజస్తాన్‌–17.5 శాతం
4. గోవా–16.2 శాతం
5. హిమాచల్‌ప్రదేశ్‌–15.8 శాతం
6. పశ్చిమబెంగాల్‌–14.9 శాతం
7. ఉత్తరాఖండ్‌–14.3 శాతం
9.8.ఢిల్లీ–13.8 శాతం
10. బిహార్‌–13.4 శాతం
11. సిక్కిం–12.5 శాతం