india unlock 4 guidelines

సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్-4.0 మొదలవ్వనుంది. దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం ఎక్కువైంది. అన్నీ తెరిచేస్తారనీ, ఇక అసలు ఎలాంటి కండీషన్లూ ఉండవని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అవి నిజం కావు. మన కేంద్ర ప్రభుత్వం… ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం నడుచుకుంటోంది.

Also Read: క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్

Covid-19 Unlock-1: Health Ministry issues safety guidelines for ...

సెప్టెంబర్ 1 నుంచి… ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందువల్ల మెట్రో రైళ్ల సర్వీసులను కేంద్రం తిరిగి ఓపెన్ చెయ్యాలనుకుంటున్నట్లు తెలిసింది. మార్చి 22న ఈ సర్వీసులు దేశవ్యాప్తంగా బంద్ అయ్యాయి. ఐతే… దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం ఇప్టటికీ సంప్రదింపులు జరుపుతోంది. మెట్రో సర్వీసులు తెరిచాక… ఎలాంటి రూల్స్ పాటించాలో… ఈవారాంతంలో గైడ్‌లైన్స్ వస్తాయని తెలిసింది.

– ఇప్పటివరకూ మెట్రో రైళ్లలో వెళ్లేవారు టోకెన్లను వాడారు. ఈసారి వాటిని వాడేందుకు అనుమతి ఉండదని తెలుస్తోంది. ఎక్కడా టచ్ లేకుండా ఉండే కాంటాక్ట్ లెస్ టికెట్ సిస్టంను కేంద్రం తేబోతోందనీ, మెట్రో రైలు కార్డుల్ని మాత్రమే వాడేందుకు అనుమతి ఇస్తుందని తెలిసింది.

– ఈసారి బార్లలో కౌంటర్ దగ్గర లిక్కర్ అమ్మేందుకు అనుమతి ఇస్తారనీ అయితే… టేక్ ఎవే సర్వీసులకు మాత్రమే అనుమతిస్తారని తెలిసింది. బార్లు కూడా మార్చి 25 నుంచి మూసి ఉన్నాయి.

– స్కూళ్లు, కాలేజీలు మాత్రం సెప్టెంబర్‌లో కూడా మూసే ఉంటాయని తెలిసింది. IITలు, IIMలు మాత్రం తెరుస్తారని సమాచారం అందుతోంది.

– థియేటర్లు, ఆడిటోరియంలు మరో నెలపాటూ మూసే ఉంచుతారని తెలిసింది. ఇప్పుడు సినిమా హాళ్లను తెరిస్తే… 25 నుంచి 30 శాతం కెపాసిటీతోనే సినిమాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అది ఎంతమాత్రం లాభదాయకం కాదు. అందువల్ల ఈసారికి థియేటర్లకు ఛాన్స్ లేనట్లే అని తెలిసింది.

– సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, అకడమిక్, కల్చరల్, మతపరమైన సమావేశాలు, సభలు, ఫంక్షన్లు, వేడుకలు, పెద్ద ఎత్తున జనం గుమికూడటాలు వంటివాటికి… సెప్టెంబర్ తర్వాత కూడా అనుమతి ఉండదని తెలుస్తోంది.- కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రకారం… కంటైన్‌మెంట్ జోన్లలో… అన్‌లాక్-4లో కూడా కఠినమైన లాక్‌డౌన ఉంటుంది. వాటిని నిరంతరం మానిటరింగ్ చేస్తూనే ఉంటారు.

– కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేశాక… వాటిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. అందువల్ల కేంద్రం అనుమతించినా… కొన్ని రాష్ట్రాలు అనుమతించకపోవచ్చు. అలాగే… కేంద్రం అనుమతించనివాటిని రాష్ట్రాలు కూడా అనుమతించకపోవచ్చు. కారణం కరోనా ఎక్కువగా ఉంది కాబట్టే.