Lakshmi Narasimha temple Fire Accident

ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం చోటుచేసుకుంది. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Lakshmi Narasimha Temple Chariot Catches Fire East Godavari - Sakshi

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన.. దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌, జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. స‌హ‌య‌క చ‌ర్యులు చేప‌డుతున్న దేవ‌దాయ, పోలీస్‌, పైరింజ‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌మోహ‌న్‌ను విచార‌ణ అధికారిగా నియ‌మించారు. బాధ్యులను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.