Modi's Twitter Account Hacked

ప్రధాని నరేంద్రమోడీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. చాలామంది ఆయన వ్యక్తిగత ట్విటర్ అనుకుంటున్నారు. కానీ హ్యాకైంది వ్యక్తిగత వెబ్‌సైట్-యాప్ కి సంబంధించిన ఖాతా. జులైలో అమెరికా ప్రముఖులు, బిలయనీర్ల ఖాతాలను కూడా ఇలాగే హ్యాక్ చేశారు.నరేంద్ర మోడీ ఖాతా హ్యాక్ అయినట్టు ప్రకటించింది ట్విట్టర్. ప్రపంచవ్యాప్తంగా నరేంద్రమోడీ ట్విట్టర్లో హవా కొనసాగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్యే ప్రధాని మోడీ తన ఇంట్లో యోగా చేస్తూ, నెమళ్ళకు ఆహారం వేస్తూ పెట్టిన వీడియోకు లక్షలాది లైకులు వచ్చాయి. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ ద్వారా మరో ఘనతను సాధించారు. తాజాగా ప్రధాని మోదీ ట్విటర్‌ అకౌంట్‌ను అనుసరించే వారి సంఖ్య ఇప్పుడు ఆరు కోట్లకు పైగా పెరిగింది.

Twitter account of PM Modi's personal website hacked - India News

తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలియగానే ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. హ్యాకింగ్ కు గురైన అకౌంట్లో ఎలాంటి అభ్యంతకరమయిన సందేశాలు వెళ్ళకుండా ట్విట్టర్ జాగ్రత్తలు తీసుకుందని తెలుస్తోంది. 2009 సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ ట్విటర్‌ అకౌంట్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి ఆయన ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప్రతీ విషయాన్ని పంచుకుంటున్నారు.