jio cricket pack

క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ప్రకటించింది. రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డేటా ప్యాక్స్ అయిన ఈ ప్లాన్లలో రూ. 399 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా లభించనుంది. ఇందులో ఒకటి రూ. 499 ప్లాన్ కాగా, మరొకటి రూ.777 క్వార్టర్లీ ప్లాన్. రూ. 499 క్రికెట్ ప్యాక్‌లో అపరిమితంగా క్రికెట్ కవరేజ్ ఉంటుంది. ఇక మరో ప్లాన్ రూ. 399 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. అలాగే, రోజుకు రూ. 1.5 జీబీ డేటా 56 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇందులో ఎలాంటి వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభించవు.

Also Read: టమాటా ధరలకు రెక్కలు… కొనాలంటేనే భయపడుతున్నా జనం

Reliance Jio 'Double Dhamaka' plans: Here's how to get the limited ...

రూ. 777 క్వార్టర్లీ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సభ్యతం ఏడాది పాటు లభిస్తుంది. ఇందులో వాయిస్, డేటా ప్రయోజనాలు కూడా లభిస్తాయి. రోజుకు 1.5 జీబీ డేటా లభించనుండగా, ఈ ప్యాక్‌తో ఓవరాల్‌గా అదనంగా 5GB డేటా లభిస్తుంది. ఈ రెండు ప్యాక్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటోంది. మరి జియోకి ప్రతిస్పందనగా మిగతా టెలికాం ఆపరేటర్లు ఏం ప్రకటిస్తారో చూడాలి.