Petrol scham In Telugu States

తెలంగాణ, ఆంధ్రపోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో అతిపెద్ద పెట్రోల్ తస్కరణ కుంభకోణం వెల్లడయింది. రెండు రాష్ట్రాల్లోని లీగల్ మెటరోలజీ కంట్రోలర్‌తో సమన్వయంతో సాగించిన ఈ ఆపరేషన్‌లో ఏపీలోని 22 తెలంగాణలో 11 పెట్రోల్ బంకులపై దాడి చేసిన పోలీసులు ఈ సరికొత్త కుంభకోణాన్ని చేదించి వాటిని సీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు సమన్వయం ఫలితంగా ఇంతవరకు 19 మంది పెట్రోల్ బంకుల యజమానులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

26 Arrested, 13 Petrol Bunks Seized As Cyberabad SOT Busts Major Fuel Scam Massive Fuel Scam Busted In Hyderabad

పెట్రోల్ కుంభకోణాల్లో ఇంత ఆధునికమైన, సాంకేతిక నైపుణ్యంతో కూడిన మోసాన్ని దేశం ఇంతవరకు కనీవినీ ఎరగదు. హైదరాబాద్‌లో బయటపడిన ఈ సరికొత్త స్కామ్ మూలాలు అటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకల్లో కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. పెట్రోల్ బంకులో డిస్‌ప్లే బోర్టులో లీటర్ పెట్రోలు సరఫరా చేసినట్లు వినియోగదారుడికి కనిపిస్తున్నా, లోపల చిప్ మాయ ద్వారా 970 ఎమ్ఎల్ పెట్రోలు మాత్రమే బండిలోకి వచ్చేలా ఏర్పాటు చేశారు.

Fuel pilfering racket busted in Hyderabad

లీగల్ మెట్రాలజీ, పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఒక మదర్ బోర్డు కూడా తయారుచేశారని తెలిపారు. ఈ విధంగా హైదరాబాద్‌లోని 11 బంకుల్లో 13 చిప్పులు అమర్చారని సజ్జనార్‌ పేర్కొన్నారు. దీనిపై ఏపీ పోలీసులకు కూడా ఈ సమాచారం ఇచ్చామని, మొత్తం తెలంగాణలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఏలూరుకు చెందిన శుభాని అతని గ్యాంగ్ ఈ స్కామ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన జోసఫ్, థామస్ అనే వ్యక్తుల ద్వారా చిప్పుల్ని తయారు చేయించారని నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు.