plasma donation to corona patients

ఎంతో మంది కరోనా బారిన పడి బాధపడుతున్నారు. ఇంకెంతో మంది ఈ వైరస్ బారిన పడి కోలుకున్నారు. అలాంటి వారిదగ్గర మిగిత వారి ప్రాణాలు కాపాడటానికి అద్భుతమైన అవకాశం ఉంది. అదే ప్లాస్మా డొనేషన్. కరోనాతో పోరాడుతున్న వారికి .. కరోనా నుంచి కోలుకున్న వారు కనీసం ఒక 500 ML ప్లాస్మా దానం చేస్తే అది ఇద్దరి ప్రాణాలను కాపాడుతుంది. ఇది చాలా గొప్ప అవకాశం. మనం అందరం కలిసికట్టుగా ఇలానే మానవత్వం చూపిస్తే త్వరలో ఈ కరోనా మహామ్మారి నుండి బయటపడవచ్చు అని అనసూయ వీడియో ద్వారా పేర్కొంది.

Also Read: ప్రధాని మోడీ ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్ప్లాస్మా దాతలను సత్కరించేందుకు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. మొత్తం 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సైబ‌రాబాద్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో ప్లాస్మా దానం చేసిన వ్య‌క్తుల‌ను ఇప్ప‌టికే టాలీవుడ్ న‌టుడు విజ‌య్‌దేవ‌ర కొండ కూడా సన్మానించారు. ప్లాస్మా దానం చేయాల‌ని హీరో నాని కూడా విజ్ఞ‌ప్తి చేశారు. ఇలా సెలబ్రిటీలతో సైబర్ బాద్ పోలీసులు ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్నారు.