sanjjanaa galrani arrested

తాజాగా బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్రానిని కూడా అరెస్టు చేశారు. సోగ్గాడు, బుజ్జిగాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించింది. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది సంజనా. ఈరోజు ఉదయం బెంగళూరు ఇందిరానగర్లో వున్న సంజన నివాసంలో సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్ ‌(సీసీబీ) బృందం సోదాలు నిర్వహించిన అనంతరం సంజనని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీబీ ఆఫీస్‌లో సంజనని విచారిస్తున్నారని తెలుస్తోంది. సంజనా ఇంట్లోకి వెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించారు. సంజనా ఉపయోగిస్తున్న బిఎండబ్ల్యూ కారును పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఇప్పటికే సంజన స్నేహితుడైన రియల్టర్ రాహుల్ శెట్టి ‌ని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మాఫియాతో రాహుల్‌కు సంబంధాలున్నట్లు అధికారులు తేల్చారు.

Also Read: బిగ్‌బాస్‌4 తెలుగు… దివి వద్యా పర్సనల్ లైఫ్

రాహుల్‌ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా సంజనా నివాసంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ మాఫియాతో శాండ‌ల్‌వుడ్ లో పలువురు నటీనటులకు సంబంధాలున్నాయని బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కోర్టు అనుమతితో సర్చ్ వారెంట్ తీసుకుని నటి సంజనా గర్లాని ఇంటిలో సోదాలు చేశామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ మీడియాకు చెప్పారు. నటి సంజనాకు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని పోలీసు అధికారులకు కొన్ని సాక్షాలు చిక్కాయని అన్నారు.

Also Read: డోస్ పెంచిన తెలుగమ్మాయి కల్పిక గణేష్