pranab mukherjee

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు ఏడు రోజుల పాటు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రణబ్ ముఖర్జీకి నేడు ఢిల్లీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Pranab Mukherjee, Coronavirus Positive, Dies Weeks After Surgery

భారతరత్న ప్రణబ్ ముఖర్జీ పార్థీవ దేహాన్ని ఇవాళ ఉదయం 9 గంటలకు ఆర్మీ ఆస్పత్రి నుంచి ప్రణబ్ ఇంటికి తరలిస్తారు. ఆ తర్వాత ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఇందులో భాగంగా ఉదయం 9.15 నుంచి 10.15 వరకు నేతలు, అధికారులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులు సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ… ప్రణబ్ పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10.15 నుంచి 11.00 వరకు ఇతర ప్రభుత్వ సిబ్బంది సందర్శిస్తారు. ఉదయ 11.00 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సాధారణ ప్రజలు సందర్శిస్తారు. ఈ సందర్భంగా కరోనా ఉంది కాబట్టి అందరూ కరోనా రూల్స్ పాటిస్తారు.