ttd key decisions on brahmotsavams

News18 Telugu - Tirumala Brahmotsavam: శ్రీవారి భక్తులకు గమనిక, ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే | TTD board decides to Conduct Brahmotsavams in temple itself in September ba- Telugu News, Today's Latest ...

టీటీడీ పాలక‌మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల దర్శనాలపై ఆంక్షలు విధించింది. సెప్టెంబరు 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా‌నే నిత్వహించాలని నిర్ణయించామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆలయంలోని బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఉంటుందిఅధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు రావడం జరిగిందని, అక్టోబర్ లో‌ జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితుల‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని, ముంబైలో దేవాలయం నిర్మాణం కు శ్రీకారం చుడతామని, వారణాసీలో దేవాలయ నిర్మాణంకు అక్కడి ప్రభుత్వంను స్దలం కేటాయింపు అనుమతులు కోరామన్నారు.