warns mohanbabu family

హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లిన కొందరు దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు తెలుస్తుంది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోహన్ బాబు నివాసంలోకి ఓ కారులో దూసుకెళ్లిన దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు.

Mohan Babu completes 44 years in the industry; fans just can't keep calm |  Telugu Movie News - Times of India

జల్‌పల్లి గ్రామ శివారులో సినీ నటుడు మోహన్‌బాబుకు సంబంధించిన మంచు టౌన్‌షిప్‌ పేరుతో నివాసం ఉంది. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో లోపలి నుంచి బైక్‌ బయటకు వెళ్లడానికి వాచ్‌మెన్‌ పెద్ద గేటు తెరిచాడు. అదే సమయంలో బయట నుంచి వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు లోపలికి ప్రవేశించింది. ఇది గమనించిన వాచ్‌మెన్‌ ఆపేందుకు ప్రయత్నించాడు. మోహన్ బాబు, కుటుంబసభ్యులను బెదిరించిన అనంతరం వారంతా పరారయ్యారు. ఈ ఘటనపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మోహన్ బాబు కుటుంబం. ఎవరా వ్యక్తులు, వారితో మోహన్ బాబు కుటుంబానికి ఏమిటీ వివాదం అన్నది తెలియాల్సి ఉంది.