ayodhya bhumi puja

ఒకవైపు వందకోట్లకు పైగా హిందువులు, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఈరోజు అయోధ్యలో జరగనున్న రామమందిరం భూమి పూజా ఘటనను తిలకించడానిన అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరిగే ఈ చారిత్రాత్మక కార్యక్రమం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ప్రభుత్వాలు సైతం ఈ వేడుకకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. 14 సంవత్సరాల వనవాసం తర్వాత… శ్రీరామచంద్రస్వామి… తను పుట్టిన అయోధ్యకు వచ్చి దాదాపు 10వేల ఏళ్లపాటూ పరిపాలించినట్లు రామాయణ మహాకావ్యం చెబుతోంది. రామ జన్మస్థలంగా చరిత్రలో నిలిచిన అయోధ్య పట్టణం… పుణ్యస్థలంగా విరాజిల్లుతోంది. రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి కూడా అయోధ్య వర్ణన తోనే రామాయణాన్ని ప్రారంభించారంటే… ఈ పట్టణం ఎంత పవిత్రమైనదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి చోట… హిందువుల ఆదర్శపూర్వక రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగబోతోంది. ఇంత కంటే పెద్ద పండుగ హిందువులకు ఏముంటుంది?

Ayodhya Ram Mandir Bhumi Pujan Live Telecast, Updates: When, Where and How  to Watch Online | The Financial Express

ఈ విశేష కార్యక్రమానికి 175 మంది అతిథులు రాబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటూ… ప్రముఖ నేతలు, స్వాములు, రుషులు రానున్నారు. హిందూ రాజ్యమైన నేపాల్ నుంచి కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ భూమి పూజ చేయనున్నారు. మోదీతోపాటూ… RSS చీఫ్ మోహన భగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్… ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఐతే… ఈ చారిత్రక వైభవ ఘట్టానికి సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి వారు రావట్లేదు. కారణం కరోనాయే. వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిలో పాల్గోనున్నారు. ఉమాభారతి… తర్వాతి రోజుల్లో అక్కడకు వెళ్తానని చెప్పారు.

Ayodhya Ram Mandir Bhoomi Pujan Live Updates: Ayodhya Ram Mandir, PM Modi, ayodhya ram mandir photo, Ayodhya News - Ayodhya Ram Mandir Bhoomi Pujan  Live Updates: अयोध्या में राम मंदिर का आज होगा

ఇదీ కార్యక్రమం షెడ్యూల్ :

– ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు మొదలై… మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది. అతిథులు రెండు గంటలు ముందే అక్కడకు చేరుకుంటారు.
– ప్రధాని మోదీ… ఉదయం 11.30కి అయోధ్య చేరుకుంటారు. అంతకుముందు ఆయన హనుమాన్‌గర్హి ఆలయాన్ని, యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి సందర్శిస్తారు.
– మధ్యాహ్నం 12 గంటలకు మోదీ… భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
– దేశంలోని 2000 ఆలయాలు, ప్రార్థనా స్థలాల నుంచి తెచ్చిన పవిత్ర మట్టి, 100 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాల్ని కార్యక్రమంలో ఉపయోగిస్తారు.
– ఈ కార్యక్రమంలో వేదికపై ప్రధాని మోదీ, మోహన్ భగవత్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాలదాస్ మహరాజ్, యూపీ గవర్నర్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ మాత్రమే ఉంటారు.
– మధ్యాహ్నం 12.30కి అసలైన భూమి పూజ కార్యక్రమం మొదలవుతుంది. 12.40కి మోదీ పునాది రాయి వేస్తారు. 12.45కి ప్రధాని ప్రసంగిస్తారు.

రామ మందిరాన్ని నగర శైలిలో నిర్మించనున్నారు. దీన్నే నార్త్ ఇండియన్ స్టైల్ అంటారు. అలయానికి ఐదు గోపురాలు ఉంటాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెట్టింపు పరిమాణంలో ఆలయాన్ని నిర్మించనున్నారు.