sri krishnashtami

కృష్ణం వందే జగద్గురుమ్.సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని “కృష్ణాష్టమి”, “గోకులాష్టమి” లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఈ సంవత్సరం స్మార్తులకు ఆగస్టు 23 శుక్రవారం రోజున శ్రీకృష్ణామి. వైష్ణవ సాంప్రదాయ ప్రకారం తేదీ 24 శనివారం రోజు కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు.స్మార్తులు తిధితో పండగ జరుపుకుంటే ,వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు.శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు ) నిద్ర లేచి, తలస్నానము చేసి మడి బట్టలు ధరించాలి.తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి.గడపకు పసుపుకుంకుమ,గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.

Also Read: వాస్తు దోషాలను తొలగించే గణపతి ప్రతిమలు

Krishnashtami News Updates| Photos | Videos| Breaking Stories

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. (Source: Oneindia)