Things To Avoid In Temples

చారిత్రకంగా దేవాలయాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రదేశాలు.క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటి నుండి నిర్మించిన అనేక దేవాలయాలు ఉత్తర భారతం కన్నా దక్షిణ భారతంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి దేవాలయాల్లో అడుగుపెట్టే మనకు అక్కడ ఎలాంటి పద్ధతులు పాటించాలి.. దేవుడిని ఎలా పూజించాలనే విషయాలను పండితులు, పెద్దలు, పూజారులు తరచుగా చెబుతూ ఉంటారు. కానీ దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలను చాలా తక్కువ మందే చెబుతారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

Hindu Temple, Temple, Religion, Building, Tourism

దేవాలయాల్లో ఇలాంటి పనులు చేయకూడదు

  1. దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారం పూజారులు, భక్తులు, అధికారులు ఏ విధంగా వ్యవహరించకూడదంటే.. ముఖ్యంగా ఆలయం లోపలికి ఎవ్వరూ కూడా వాహనాలలో రావడం.. చెప్పులు, బూట్లతో వంటి వాటితో తిరగడం చేయరాదు.
  2. ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాతే గుడి లోపలికి ప్రవేశించాలి. ఆలయంలో లోపలికి తలపాగా ధరించి వెళ్లకూడదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు.
  3. ఆలయంలోకి ఒట్టి చేతులతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూ గాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.
  4. దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత నిద్రపోవడం, కాళ్లు చాపుకుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన వంటి పనులు చేయకూడదు.
  5. ఆలయాల్లో ఎవ్వరితోనూ.. ఎప్పటికీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసించడం వంటివి అస్సలు చేయరాదు.
  6. దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు. ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయ ప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *