vastu ganesha at home

భారతీయ సంస్కృతీ లో గణపతి కి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఏ పని ప్రారంభించినా గణపతికె మొదటి పూజ, వాస్తు విషయం లో కూడా గణపతి కె పెద్ద పీట. వాస్తు శాస్త్రం లో గణపతి పూజ అన్ని వేళలా ప్రాముఖ్యత వహిస్తుంది. గణపతి ప్రతిమ లేని ఇల్లు ఉండదు, ఇంటి అలంకరణ విషయం లో కూడా గణపతి మూర్తి ని వాడడం విశేషం, ఈ ప్రతిమలు రకరకాల రంగులలో, బిన్న ఆకృతులతో మనకి లభ్యమవుతున్నాయి. ఇలా లభ్యమైన గణపతుల్ని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టం గా ఇళ్ళలో అలంకరించుకొంటారు, దానికే మనం కొద్దిగా వాస్తు కూడా జోడించి, ఈ ప్రతిమలను అలంకరించుకొంటే అన్ని విధాల మంచి జరుగుతుంది.ఉన్న సమస్యను బట్టి ఎంపిక చేసుకోవాల్సిన గణపతి రూప విశేషాలను వారు సూచిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకొందాం.

bpositivetelugu

వక్ర తుండ గణపతి – తుండం ఎడమ వైపు కు తిరిగి ఉన్న గణపతి రూపం ప్రాముఖ్యవహిస్తుందని ఒక ప్రతీతి. ఈ రూపం గల ప్రతిమను ఇంటి ముఖద్వారం పై ప్రతిష్టించడం వలన సకారాత్మ శక్తి సంచారం జరుగుతుంది. కొందరు ఇటువంటి మూర్తి ని ఇంటి మధ్యలో అంటే బ్రహ్మ స్థానం లో ప్రతిష్టిస్తారు, దీనివలన ఇంట్లో సకారాత్మక శక్తి స్థిరంగా ఉంటుంది. ఇంటి వాతావరణం లో కూడా సమతౌల్యం ఏర్పడుతుందని నమ్మకం. పసుపు రంగుతో ఉండడం మరీ విశేషం గా పరిగణించబడింది.

Amazon.com: Ganesh Vakratunda, Vinayak, Lambodar, Ganpati, Gajanan Indian  Hand Crafted Religious God Ganesha Mosaic Statue: Home & Kitchen

ఏకదంతం గణపతి – ఏకదంతం ఉన్న స్వరూపం గల గణపతి ని ప్రతిష్ఠిస్తే నకారాత్మక శక్తి నశించి ధన వృద్ది కలగడమే గాక కుటుంబం లో సమస్యలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి, మంచి ఆలోచనలు , బుద్ది వికాసం ఏర్పడతాయి.

Buy Vedic Vaani Ekadanta - Vighnaharta Ganpati Ganesha God Idol, Statue,  Buy Online| Hindu God Ganesha Idol Ganpati Statue Sculpture|Vighnaharta Ganpati  Ganesha Idol Online at Low Prices in India - Amazon.in

మహోదర గణపతి – ఈ మూర్తి ని ఇంటి మధ్య భాగం లో ప్రతిష్టించడం వలన నకారాత్మక శక్తి ని తొలగిపోతుంది. దృష్టి దోషం తొలగి విఘ్నాలు నివారింపబడతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

Dhumravarna.jpg - VedicFeed

గజానన గణపతి – ఈ మూర్తి ని ప్రతిష్టించడం వలన ఆధ్యాత్మిక శక్తి వృద్ది చెంది , కుటుంబం లో సభ్యుల లో పరస్పర స్నేహభావం, ప్రేమానురాగాలు ఏర్పడతాయి. గజానన ముఖం లోని పొడవైన తుండం, పెద్ద చెవులు లోభాన్ని త్యజిస్తాయి, అలాగే ముందుచూపు ని పెంచుతుంది. చిన్న కళ్ళు బుద్ది తీక్షత ను వృద్ది చేస్తాయి. గజ ముఖం శాంతి ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. యంత్ర, మంత్ర సాధనలలో ఈ స్వరూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.

Buy SHIVIKA Bonded Bronze Lord Ganesha Statue Gajanana Figurine Ganpati Son  of Lord Shiva Parvati Idol for House Décor/Gifts/Diwali Gifts/House Warming  Gift Online at Low Prices in India - Amazon.in

లంబోదర – పెద్ద పొట్ట గల మూర్తి ని స్థాపించడం వలన ఇంటిని విశాలం గా, స్వచ్చంగా ఉంచే ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. క్రోధాన్ని నిరోధించగలిగే శక్తి కలుగుతుంది.

Lambodara Ganesha in Silver Hue with Coral and Turquoise Color Inlay |  Brass statues, Ganesha, Turquoise color

వికట గణపతి – వికట గణపతి మూర్తి ని ని భవన నిర్మాణం లో ముఖ్యం గా వాడతారు. ముఖద్వారం అంతిమ ద్వారం, శౌచాలయం నిర్ణయించి నిర్మించటానికి సహకరిస్తుంది. దిశానిర్దేశానికి చక్కగా ఉపయోగపడుతుంది.

Vikata Sankashti Vrat/Chaturthi - Boldsky.com

విఘ్న గణపతి – చేతిలో కమలం ఉన్నటువంటి గణపతి ని ప్రతిష్టించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి. ఈ మూర్తి శక్తి ని ఉత్పన్నం చేయగల సమర్ధత కలిగి ఉంటుంది. ఆపదలు తొలగి పోతాయి.

Vighna Ganapati, Ganesha as the Lord of Obstacles - HinduPad

ధూమ్రవర్ణ గణపతి – ఈ మూర్తి ని ప్రతిష్టించడం వలన రాహుగ్రహ శాంతికి ఉపయోగపడుతుంది. ముఖద్వారం పై ఈ ప్రతిమ ఉంటే అనిష్ట గ్రహాలను శాంతింపజేసి సుఖ వృద్ది కి తోడ్పడుతుంది..

Dhumravarna.jpg - VedicFeed