Chinta Chiguru Pulihora

చింతపండు రసంతో, టమోటాతో, నిమ్మకాయతో పులిహోర చేసినట్టే చింతచిగురుతో కూడా చాలా రుచికరంగా పులిహోర చేసుకోవచ్చు. చింతచింగురు కూడా కాస్త పుల్లగా ఉంటుంది కనుక రుచి కూడా కాస్త పుల్లగా వచ్చి తినేందుకు బాగుంటుంది.

Sailaja Kitchen...A site for all food lovers!: Dry Chinta Chiguru(Tender Tamarind Leaves) Puliyohara/Puliyodharai

కావాల్సిన పదార్థాలు :

చింత చిగురు : ఒక కప్పు, బియ్యం : రెండు కప్పులు, వేరుశనగ పలుకులు : గుప్పెడు, మినుప్పప్పు : ఒక టీ స్పూన్‌, శెనగపప్పు : ఒక టీ స్పూన్‌, ఎండుమిర్చి : నాలుగు, కరివేపాకు : రెండు రెబ్బలు, ఆవాలు : అర టీ స్పూన్‌, ధనియాలు : ఒక టీ స్పూన్‌, పసుపు : పావు టీ స్పూన్‌,ఉప్పు : రుచికి సరిపడా, నూనె : తగినంత

తయారీ విధానం :

అన్నం పొడిగా అయ్యేలా వండుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని, చింత చిగురును వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఎండుమిర్చి, ధనియాలు, మినుప్పప్పు, శెనగపప్పు, వేరుశనగ పలుకులను కూడా వేయించుకోవాలి. వేయించిన చింత చిగురు, పోపు దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే చింత చిగురు పొడి వేసి, బాగా కలుపుకోవాలి. కాసేపయ్యాక పొడిపొడిగా చేసుకున్న అన్నంతో పాటు తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. అంతే, వేడివేడి చింత చిగురు పులిహోర రెడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *