chintakaya royala recipe in telugu

కావాల్సిన పదార్థాలు

రొయ్యలు: అర కిలో,

చింతకాయ ముక్కలు: 100 గ్రా.

ఉల్లిపాయ ముక్కలు: అర కప్పు

అల్లంవెల్లుల్లి పేస్టు: ఒక టేబుల్‌ స్పూను

గరంమసాలా: ఒక టీ స్పూను, కారం: రెండు టీ స్పూన్లు, కరివేపాకు: రెండు రెబ్బలు, పసుపు: అర టీస్పూను, నూనె: సరిపడా,

ఉప్పు: తగినంత

తయారు చేసే విధానం

ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. లేత చింతకాయ ముక్కల్ని రోట్లో దంచుకొని పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు , కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, రొయ్యల్ని కూడా వేసి కలపాలి. ఓ పది నిమిషాలు సన్నని మంటపై ఉంచాలి. రొయ్యలు మగ్గాక దంచిపెట్టుకున్న చింతకాయ ముద్దను కడాయిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు గరంమసాలా వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *