pepper rasam recipe

మిరియాల రసం … దీనిని అన్నం లో కలుపుకోవచ్చు లేదంటే సూప్ లాగా తాగావచు.ఇది జలుబు మరియు దగ్గుకి చాల చక్కటి పరిష్కారం.మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Also Read: మష్రుమ్ మసాలా కర్రీ

Pepper Rasam Recipe: How to Make Pepper Rasam Recipe | Homemade Pepper Rasam Recipe

కావలసిన పదార్దాలు: 

  • మిరియాలు – 2 స్పూన్లు
  • మినపప్పు – 2 స్పూన్లు
  • నెయ్యి – 2 స్పూన్లు
  • 1/2 ఆవాలు
  • 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరి
  • 8 -10 కరివేపాకు ఆకులు
  • 2 ఎండు మిరపకాయలు
  • ఉప్పు రుచికి తగినంత,నీళ్లు తగినంత

తయారీ విధానం..

  1.  నెయ్యిని ఒక పాన్ లో వేసి వేడిచేసినతరువాత, మిరియాలు మరియు మినపప్పును వేసుకోండి. మినపప్పు బ్రౌన్ గా వచ్చేంత వరుకు వేయించుకోండి.
  2. అదే పాన్ లో ఇంకా కొంచెం నెయ్యిని పోసుకొని అందులో ఆవాలు,ఇంగువ,కరివేపాకు మరియు ఎండు మిరపకాయలను వేయండి.
  3.  అన్ని పదార్దాలను మిక్సర్ లో వేసి పేస్ట్ అయేంత వరుకు గ్రైండ్ చేయండి. పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇంతక ముందు తాలింపు వేసుకున్న పాన్ లోకి జోడించండి.
  4.  చారు కాగిన తరువాత తగినంత ఉప్పును వేసుకోవాలి. దీనిని అన్నంలో వేసికొని నెయ్యితో కలిపి వడ్డించండి.ఈ రెసిపీ అరుగుదలకు(జీర్ణక్రియకు) చాల మేలైనది మరియు జలుబు లేదా జ్వరం ఉన్నవారికి ఇది ఏంతో ఉత్తమమైన రెసిపీ.

Also Read: టేస్టీ పాస్తా తయారుచేయడం చాలా ఈజీ