saggubiyyam pakodi in telugu

సగ్గుబియ్యం అనగానే ముందుగా పండగనాడు చేసే పరమాన్నం గుర్తొస్తుంది. కానీ సగ్గుబియ్యంతో పలు చిరుతిళ్ళు చేసుకోవచ్చని చాలామందికి తెలియదు. ఈ వంటల జాబితాలో చిన్నారులు ఇష్టపడే సగ్గుబియ్యం పకోడీ కూడా ఒకటి.

నోరూరించే సగ్గుబియ్యం పకోడీ.. | Health Tips | Health Tips In Telugu - Healthchitkalu.com

కావలసినవి

సన్న సగ్గుబియ్యం, చిక్కని పెరుగు, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి – అరకప్పు చొప్పున, ఉల్లిపాయలు (పెద్దవి) – 2, అల్లం తురుము – 2 చెంచాలు, పచ్చిమిర్చి తురుము – 4 చెంచాలు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె – వేయించడానికి సరిపడా

తయారీ

ముందుగా గిలకొట్టిన పెరుగులో సగ్గుబియ్యాన్ని 5 గంటల పాటు నానబెట్టాలి. అవి బాగా నానాక బియ్యప్పిండి, బొంబాయిరవ్వలో వాటిని కలిపి, ఆపై.. సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్నిబట్టి ఇంకా పెరుగూ కలుపుకోవచ్చు. ఆ తర్వాత.. మూకుడులో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ పిండిని పకోడీ ల మాదిరిగా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి నచ్చిన చట్నీతో నంజుకు తింటే ఎంతో రుచిగా ఉంటాయి.