happy birthday taapsee pannu

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్‌తో యూత్ మతిని పోగోట్టింది. ఈ మూవీలో హీరో మనోజ్‌తో తాప్సీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. అటు సౌత్‌లోనూ,ఇటు నార్త్‌లోనూ అగ్ర నటుల సరసన నటించింది. అయితే తెలుగు సినిమాలపై అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ కాస్త వివాదాస్పదమయ్యాయి. అందాల ప్రదర్శన పేరుతో అర్థంలేని సన్నివేశాల్ని తీయడం తెలుగు సినిమాల్లో కామన్ అని.. ఝమ్మంది నాదం సినిమాలో తన బొడ్డుపై తీసిన షాట్స్ ఎందుకు తీశారో కూడా తనకు అర్ధం కాలేదని అప్పట్లో వ్యాఖ్యానించారు.

Image

Also Read: చీరకట్టులో నభా నటేష్..

Image
 సౌత్‌ను వదిలిపెట్టలేదు : చాలామంది నటీనటులు బాలీవుడ్ వెళ్లిపోయాక సౌత్ సినిమాలు తగ్గించేస్తారు. కానీ తాప్సీ మాత్రం సౌత్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. మిళంలోనూ తాప్సీ కొత్త ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్‌లో 10 సినిమాలు చేస్తే.. సౌత్‌లో 6 సినిమాలు చేస్తూ.. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటోంది.

చాలామంది నటీనటులు బాలీవుడ్ వెళ్లిపోయాక సౌత్ సినిమాలు తగ్గించేస్తారు. కానీ తాప్సీ మాత్రం సౌత్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. మిళంలోనూ తాప్సీ కొత్త ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్‌లో 10 సినిమాలు చేస్తే.. సౌత్‌లో 6 సినిమాలు చేస్తూ.. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటోంది.

 ఎవరి అండదండలు లేకుండా తాప్సీ బాలీవుడ్‌లో ఈ స్థాయికి చేరింది. ఎంతలా అంటే ఒకప్పుడు సినిమాలు లేకుండా గడిపిన తాప్సీ ఇపుడు ఎంచక్కా తనకు నచ్చే స్క్రిప్ట్స్‌ను ఎంచుకునేంత స్థాయికి ఎదిగింది. Photo: Instagram.com/taapsee
Image
 బాలీవుడ్ సక్సెస్ : సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి చాలామంది హీరోయిన్లు అడుగుపెట్టినప్పటికీ.. సక్సెస్ అయినవారు మాత్రం తక్కువ. కానీ తాప్సీ మాత్రం బాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించింది. తనకంటూ ఓ సొంత ఇమేజ్ ఏర్పరుచుకుంది. 
 వెనక్కి తగ్గని తత్వం : వ్యక్తిత్వం విషయంలోనూ, సినిమాల ఎంపికలోనూ తాప్సీ అస్సలు రాజీపడరు. చష్మే బద్దూర్,బేబీ సినిమాల తర్వాత ఏడాది గ్యాప్ వచ్చినా.. ఆమె నిరాశ చెందలేదు. పింక్,ఘాజీ ఎటాక్,నామ్ షబానా,జుడ్వా2 వంటి సినిమాలతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *