pragya jaiswal

ప్ర‌గ్యాజైశ్వాల్…తెలుగులో క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘కంచె’ చిత్రంతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓం న‌మో వెంక‌టేశాయ‌, న‌క్ష‌త్రం, జ‌య జాన‌కి నాయ‌క వంటి చిత్రాల్లో తన న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సోష‌ల్ మీడియాలో అప్ప‌డపుడు క‌నిపించే ఈ భామ తాజాగా ఫొటోషూట్ లో పాల్గొంది. బ్లాక్ షార్ట్‌, టాప్ లో కెమెరాకు పోజులిచ్చిందీ బ్యూటీ.

పొడ‌వాటి కురులు, మెస్మ‌రైజ్ చేసే చూపు, ఆక‌ట్టుకునే అందంతో డిఫ‌రెంట్ షేడ్స్ లో ప్ర‌గ్యాజైశ్వాల్ దిగిన ఫొటోలు క‌ళ్లు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తున్నాయి. 2018లో మంచు విష్ణుతో క‌లిసి ఆచార్య అమెరికా యాత్ర చిత్రంలో న‌టించింది ప్ర‌గ్యా. ఈ చిత్రం ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత మ‌రే సినిమాలో క‌నిపించ‌లేదు.