health benefits of Jackfruit Seeds

Jackfruit Seeds : పనస పండు.. బయటకు భయానకంగా కనిపించినా.. దాని లోపల ఉండే తొనలు నోరూరిస్తాయి. ఈ పండు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది. ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ పండు కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే తప్పకుండా పనస పండు తినాల్సిందే . అయితే పనస పండు తో పటు దాని తొనల్లో(Jackfruit Seeds) విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి పోష‌కాలు విరివిగా ల‌భిస్తాయి. అలసట తగ్గడంతోపాటు చర్మ సౌందర్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే, పనస పండు గింజలతో క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను తెలుసుకుందాం.

Also Read : రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?… ఈ టిప్స్‌ తో ఎంచక్కా నిద్రపోండి.

health benefits of Jackfruit Seeds

పనస పండు గింజలతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

  • ప‌న‌స గింజ‌ల్లో (Jackfruit Seeds)ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఐర‌న్ ల‌భించి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్క‌వ‌చ్చు. రక్త వృద్ధి కూడా జ‌రుగుతుంది. వీటిని తినేవారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వీటి వ‌ల్ల‌ ఇమ్యూనిటీ ప‌వ‌ర్ చాలా పెంచుకోవ‌చ్చు.
  • శరీర జీర్ణక్రియ సాఫీగా జ‌రిగేందుకు ప‌న‌స గింజ‌లు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌ల‌తో శరీరం బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పనసపండు గింజలను ఉడికించి తింటే ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
  • ప్రస్తుత కాలం లో టీవీ, మొబైల్, కంప్యూటర్ చూడటం వల్ల కళ్లకు ఎక్కువ ఒత్తిడి కలిగి కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కంటి ఆరోగ్యంపై దృష్టిపెట్టడానికి ముందు ప‌న‌స గింజ‌ల‌ను గుర్తుచేసుకోవాలి. కంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం మొల‌కెత్తిన‌ పనస గింజలు తినాలి.
  • మహిళలు పొడవాటి జుట్టును కోరుకుంటుంటారు. పని ఒత్తిడి వల్ల చాలా మందిలో జుట్టు రాలిపోతుంటుంది. అలాంటి వారికి పనస గింజలు అధిక మేలు చేస్తాయి.
  • మనిషికి శృంగారం కూడా చాలా ముఖ్యం. పనస తొనలతోపాటు.. గింజలను ప్రతిరోజూ తింటే శృంగార స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చున‌ని నిపుణులు పేర్కొంటున్నారు.
  • అదేవిధంగా వీటిని నిత్యం తీసుకునే వారిలో ఎముక‌ల‌తోపాటు దంతాలు గ‌ట్టిగా త‌యారవుతాయి. ఇన్ని ప్ర‌యోజ‌నాలున్న ప‌న‌స గింజ‌ల‌ను వృధాగా పారేయ‌కండి.. వీటిని కూడా తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి..!

Also Read : దీర్ఘాయువు కోసం రోజూ రెండు పండ్లు, మూడు కూర‌గాయ‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *