Benefits Of Clove

కరోనావైరస్ విజృంభిస్తోంది.ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C మరియు K ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ C మరియు K రోగనిరోధకతను పెంచుతాయి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతాయి. అందుకోసం మన పెద్దలు ఎప్పుడో అనేక చిట్కాలు చెప్పారు. వాటిలో లవంగాలు గురించి తెలుసుకుందాం.

11 Surprising Health Benefits of Cloves | Organic Facts

  • ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.
  • ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు మటుమాయమంటున్నారు వైద్యులు.
  • లవంగాల నుంచి నూనె తీయనివి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  • ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు తగ్గుతాయి.
  • జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తీసుకోండి. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
  • లవంగాలు సేవిస్తే ఆకలి బాగా వేస్తుంది. వీటి వలన జీర్ణక్రియకు అవసరమైన రసాలు ఉదరంలో ఊరుతాయంటున్నారు వైద్యులు.
  • లవంగాలను తీసుకోవాలనుకునేవారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే సేవించాలి. అంతకుమించి వాడితే శరీరంలో వేడి చేస్తుంది. ఫలితంగా వేరే సమస్యలు ఉత్పన్నమవుతాయి.