benefits of coriander

కూరలో కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు. చాలామంది కూరల్లో కొత్తిమీరను రుచికోసం వేస్తూ ఉంటారు.కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కొత్తిమీర ను వాడటం ప్రారంభిస్తారు. ఇప్పుడు కొత్తిమీర లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

Also Read: గోరువెచ్చని నీరు తో ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు

8 Surprising Health Benefits of Coriander

తాజా కొత్తిమీరలో దాగున్న ఆరోగ్య రహస్యాలు:

  • కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రిబ్యూట్ చేస్తుంది.
  • కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్’లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది.
  • కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్’ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.
  • కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్ అంతే కాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.
  • కొత్తిమీరలో ఉండే క్యాల్షియం, బోన్స్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, ఇతర మినిరల్స్, బోన్ హెల్త్ కు సహాయపడుతాయి. డ్యూరబులిటిని పెంచుతాయి. .
  • కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి కొత్తిమీర సహకరిస్తుంది.