Kidney diet and foods

kidneys : మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు(kidneys) ఒకటి . అయితే మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి? మీ మొత్తం ఆరోగ్యాన్ని మీరు చూసుకునే విధంగానే – ఆహారం మరియు జీవనశైలి ఎంపికలు. వ్యాయామం, పుష్కలంగా నీరు త్రాగటం మరియు సిఫార్సు చేసిన ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ వంటి సమతుల్య ఆహారం తీసుకోవడం .. కిడ్నీలు 90 శాతం పాడైన తర్వాతే లక్షణాలు బయటపడతాయి. కాబట్టి.. పరిస్థితిని అంతవరకు తెచ్చుకోకుండా ఉండాలంటే రోజూ మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కిడ్నీలు(kidneys) పాడైనట్లయితే.. చేతులు, పాదాల్లో నీరు చేరినట్లు అనిపిస్తుంది. కళ్లు ఉబ్బడమే కాకుండా మూత్ర విసర్జన కూడా కష్టమవుతుంది. పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. Also Read : సంపూర్ణ ఆరోగ్యం కోసం..నేరేడుపండు

ఆరోగ్యంవంతమైన కిడ్నీలు(kidneys) కోసం

చేపలు : చేపల్లోని ఒమేగా-2 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ ఫ్యాట్స్ అధికంగా లభిస్తాయి. ప్రొటీన్లు పుష్కలంగా లభ్యమయ్యే చేపలు కిడ్నీలను కాపాడతాయి.

యాపిల్ : యాపిల్ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు అధికంగా లభిస్తాయి. యాపిల్ పండ్లు కొలెస్ట్రాల్‌ను, మలబద్దకాన్ని తగ్గిస్తాయి. కిడ్నీలను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.

క్యాప్సికమ్ : కిడ్నీ ఆరోగ్యానికి క్యాప్సికమ్ చాలా మంచిది. ముఖ్యంగా ఎర్ర రంగు క్యాప్సికమ్ కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. రెడ్ క్యాప్సికమ్ రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. రెడ్ క్యాప్సికమ్‌లో పొటాషియం తక్కువగా ఉంటుంది.

గుడ్డు : కిడ్నీ సమస్యలతో బాధపడేవారు గుడ్డులోని పచ్చసొనను పక్కనబెట్టి తెల్ల సొన (ఎగ్ వైట్) తినడం మంచిది. గుడ్డు తెల్లసొనలో పోషకాలతోపాటు ఫాస్ఫరస్ కూడా తక్కువగా ఉంటుంది.

క్యాలిఫ్లవర్ : క్యాలిఫ్లవర్ ఒంట్లో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపుతుంది. క్యాలిఫ్లవర్‌లో విషతుల్యాలను బయటకు పంపే ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్, థియోసైనేట్స్ అధిక మోతాదులో ఉంటాయి.

సూచన : ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.

Also Read : తిప్పతీగ ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *