Diabetic Patients

Diabetic Patients: చెవిలో ఉండే గువిలితో ప్రారంభ దశలో మధుమేహాన్ని గుర్తించవచ్చునా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. చెవిలో ఉండే మైనం నుంచి గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేయగా మధుమేహాన్ని ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుసుకోవచ్చని సెలవిస్తున్నారు లండన్ యూనివర్శిటీ కాలేజీ నిపుణులు. ఇది 60 శాతం వరకు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని, అలాగే చవకైనదని కూడా పేర్కొంటున్నారు.

Research for diabetic patients: Can check glucose level at home with earwax, claim; It gives accurate results up to 60 percent

మధుమేహాన్ని లక్షణాల ఆధారంగా గుర్తిస్తారు. అయితే చెవి గువిలి పరీక్షలను ఇంట్లో సులభంగా చేసుకోవచ్చని, అలాగే దీనికి నిపుణులు అవసరం లేదంటున్నారు. ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరికి ఈ వ్యాధి గురించి తెలియదని యూనివర్శిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్త ఆండ్రేస్ హెరెన్ చెప్పారు. చెవిలోని మైనం ద్వారా మధుమేహం ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని సిద్ధం చేశారు. ఇది చెవి నుంచి శుభ్రపరచు నమూనా తీసుకుంటుంది. ఈ నమూనా ప్రత్యేక ద్రావణంలో మునిగిపోతుంటే.. గ్లూకోజ్ పెరిగిందా లేదా అనేది తేలుతుందంట. డయాబెటిస్ లేని 37 మందిని పరిశీలించిన తర్వాత గ్లూకోజ్ స్థాయిని ఎప్పుడైనా తనిఖీ చేయడానికి వీలుగా ఇటువంటి పరీక్షలపై పని చేస్తున్నామని ఆండ్రేజ్ చెప్పారు.

మునుపటి అధ్యయనాలు ఇయర్‌వాక్స్ ద్వారా ఒత్తిడిని కూడా గుర్తించవచ్చని తేల్చాయి. పరీక్ష కోసం అభివృద్ధి చేసిన పరికరం నమూనాలోని ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నమూనాలో హార్మోన్ ఉండటం వ్యక్తి ఒత్తిడికి లోనవుతున్నదీ లేదా నిరాశకు లోనవుతున్నదీ చూపిస్తుందని వారు చెప్తున్నారు. ఏది ఏమైనా, చెవిలోని చెత్తతో మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల మున్ముందు దాని స్థాయిలు పెరుగకుండా చూసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *