Mangoes and blood sugar

Mangoes : పండ్లలోకెళ్ళ రారాజు మామిడిపండ్లు అని చెబుతారు. ఎందుకంటే స్వీట్ టెస్ట్ మరియు బ్యూటిఫుల్ స్కిన్, ఆరోమా ఫ్లేవర్ అద్బుతమైనటువంటి మాత్రమే కాదు,అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మామిడిపండ్లు ముఖ్యంగా మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఈహెల్తీ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల పురుషుల్లో హెల్తీ స్ఫెర్మ్ ఉత్పత్తి అవుతుంది మరియు స్పెర్మ్ యొక్క క్వాలిటీ మెరుగుపడుతుంది. ఈ పండులో ఉండే న్యూట్రీషియన్స్ వ్యక్తిలో వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

డయాబెటీస్ పేషెంట్లు మామిడి పండ్లను తినకూడదు అనేది పూర్తిగా అపోహేనని వైద్యులు చెబుతున్నారు. టైప్-2 డయాబెటీస్ ను తగ్గించడంతో ఇవి సమర్థవంతంగా పని చేస్తాయట. అందుకే.. మధుమేహ వ్యాధిగ్రస్థులు కూడా మామిడి పండ్లను మితంగా తీసుుకుంటే ఎటువంటి సమస్యా ఉండదు. ఇక.. మ్యాంగోస్ లో ఉండే పీచు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయట.

మామిడి ఇన్‌స్టెంట్ ఎనర్జీ బూస్టర్‌గా పని చేస్తుంది. మరీ ముఖ్యంగా.. పచ్చి మామిడి కాయను ముక్కలుగా కోసి తేనె, యాలకుల పొడిని చల్లుకుని తింటే వెనువెంటనే శక్తి వస్తుంది.

రక్త హీనతతో బాధపడే వారు రోజుకో మ్యాంగో తింటే మంచిది. మామిడి పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఫలితంగా రక్తం వృద్ధి చెందుతుంది.

మామిడి పండులో జీర్ణ క్రియను మెరుగుపరిచే ఎంజైమ్స్, ఫైబర్ కంటెంటె చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పచ్చగా ఉండే మామిడి కాయలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. అందుకే జీర్ణ సంబంధ సమస్యలతో సతమతమయ్యే వారు వీటిని తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే.. సన్నగా ఉండే వారు మామిడి పండ్లను తింటే ఆరోగ్యకరంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read : మల్లెపూలు తో బోలెడు ఆరోగ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *