coffee health benefits

కాఫీ తాగ‌డ‌మంటే చాలామందికి ఇష్టం. ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీ పడితేనే ఆరోజు ప్రారంభం అయినట్లు కాఫీ ప్రియులు భావిస్తారు. కాఫీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు, రుచి ఉంది. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అలాగే తలనొప్పికి కూడా గురువుతుంటారు. ఇంకా చాలా సమస్యలతో బాధపడుతుంటారు. వీటన్నింటి నుంచి ఉపశమనం కలిగించడానికి కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండేు కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. పలు వ్యాధులను దూరం చేస్తుంది.మీరు ఏవైనా వ్యాధులతో బాధపడుతుంంటే దీన్ని తీసుకునే ముందు ఒకసారి డాక్టర్లను కూడా సంప్రదించాలి.

Beverage, Cappuccino, Coffee, Breakfast, Caffeine

కాఫీ వల్ల ఉండే బెనిఫిట్స్ 

  • కాఫీ తాగగానే మీ మెదడుకు ఎక్కడలేని చురుకుదనం వస్తుంది. కెఫిన్ అనే పదార్ధం మెదడు కణాలను ప్రభావితం చేయగలదు. దీంతో అవి బాగా ఉత్తేజంగా పని చేస్తాయి. మీ మెదడుకు అవసరమయ్యే ఆక్సిజన్, రక్త సరఫరాను పెంచే సామర్థ్యం కూడా కెఫిన్ కు ఉంటుది. అందువల్ల మీ బ్రెయిన్ కాస్త చురుగ్గా పని చేయాలంటే మీరు ఆ సయమంలో కాఫీ తాగితే సరిపోతుంది.
  • కెఫిన్ మీ మెదడు కణాలు ప్రభావితంగా పని చేస్తాయి. మెదడు కణాలు మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తి పెంచడానికి, మన నాలెడ్జ్ పెంచడానికి బాగా పని చేస్తాయి.
  • సాధారణంగా మధుమేహం వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. టైప్ – 1, టైప్ – 2. మధుమేహం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గిపోతుంది. అయితే కాఫీలో ఉండే కెఫీన్ శరీరానికి అవసరమయ్యే ఇన్సులిన్ హార్మోన్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది.
  • కాఫీలో ఆరోగ్యకరమైన అనామ్లజనకాలు ఉంటాయి. ఇవి కంటి కణాలు ఉత్తేజంగా పని చేసేలా చేస్తాయి. కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మూలంగా రెటీనా ఆరోగ్యకరంగా ఉంటుంది.
  • మెదడుకు అందే రక్త ప్రసరణను “కెఫైన్” నియంత్రించడంతో పాటు ట్యూమర్ల పెరుగుదలను నిలిపివేస్తుంది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక కణాల నుంచి మెదడును రక్షిస్తాయి.
  • రోజూ కాఫీ తాగడం వల్ల మీ పొట్ట చుట్టు ఉండే కొవ్వు తగ్గుతుంది. అలాగే మీకు త్వరగా ఆకలి వేయదు. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు.
  • కాఫీలో ఉండే కెఫిన్ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో మీరరు ఆసయంలో రెచ్చిపోవొచ్చు.
  • కొందిరిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాఫీలోని కెఫిన్ మెదడులోని కర్టిసోల్ హార్మోన్ల మెరుగుపరిచి ఆందోళనను తగ్గిస్తుంది.
  • కాఫీ మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మీ పేగులు సక్రమంగా పని చేసేలా చేస్తుంది. దీంతో మలబద్ధకం తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *