cold and cough relief

జలుబు.. వచ్చిందంటే చాలు.. ఓ పట్టాన వదలదు. ఓ సామెత ఉంది. జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారంరోజుల్లో తగ్గుతంది. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని చెబుతారు. అంటే.. జలుబు వస్తే ట్యాబ్లెట్స్ వేసినా.. వేయకపోయినా అది తగ్గాల్సిన టైమ్‌లోనే తగ్గుతుంది.అందుకే ప్రారంభంలోనే సమస్యకు చెక్ పెట్టాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు అనేవి ఎలా వస్తాయో, వాటికి ఎలా చెక్ పెట్టాలో తెలిస్తే… అసలు అనారోగ్యం అన్నదే లేకుండా చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్, స్పైసీ మసాలా ఫుడ్స్, బిర్యానీ వంటి వేడి చేసే ఆహారాలు తక్కువగా తీసుకుంటే… బాడీలో హీట్ కంట్రోల్‌లో ఉండి… అనారోగ్యం రాకుండా ఉంటుంది. పొరపాటున వేడి చేస్తే… వెంటనే ఈ చర్యలు చేపట్టడం ద్వారా జలుబు, దగ్గును పూర్తిగా కంట్రోల్ చెయ్యవచ్చు.

Also Read: మన వంట ఇల్లే ఒక వైద్యశాల

Cold and Cough Medicines: Over the Counter Relief

Black peppercorns + honey : 8 నల్ల మిరియాల గింజల్ని పొడి చేసి… ఓ టేబుల్ స్పూన్ తేనెలో కలపాలి. రాత్రి పడుకునే ముందు ఓసారి, ఉదయం లేవగానే మరోసారి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే… దగ్గు పరారవుతుంది.

Ginger for Cold & Cough: 7 ways to use ginger to prevent and cure cough & cold

Ginger + turmeric powder + honey : ఓ చిన్న అల్లం ముక్కను… చితక్కొట్టండి. అరకప్పు నీటిలో వేసి… ఉడికించండి. సిమ్‌లో నిమిషం పాటూ ఉడికించండి. స్టవ్ ఆపేసి, బాగా కలపండి. ఓ టేబుల్ స్పూన్ తేనె వెయ్యండి. చిటికెడు (టీస్పూన్‌లో నాలుగోవంతు) పసుపు వెయ్యండి. బాగా కలపండి. ఉదయాన్నే తాగండి. సాయంత్రం తాగండి.

Garlic : వెల్లుల్లిలో ఎల్లిసిన్ ఉంటుంది. వెల్లుల్లి రెబ్బని నమిలితే, అందులో ఎల్లిసిన్… వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్‌గా వచ్చే వ్యాధుల్ని దూరం చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఏమీ తినకముందే… రెండు వెల్లుల్లి రెబ్బలను నమలండి. దగ్గు, జలుబుకి గుడ్ బై చెప్పండి.వీటితోపాటూ… బాగా నిద్రపోవాలి. (రోజుకు 8 గంటలు). పోషకాహారం తినాలి. నీరు బాగా తాగాలి. ఎక్సర్‌సైజ్ చెయ్యాలి. అప్పుడు దగ్గు, జలుబు రమ్మన్నా రావు.

Also Read: స్టీమ్‌ థెరపీ…. ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు