curry leaves health benefits

కర్రీ లో క‌రివేపాకు అంటే అంద‌రికీ చుల‌క‌నే. తినే కర్రీ లో ఎక్క‌డ క‌నిపించినా తీసి ప‌క్క‌న పెడుతారు. ఇలా చేసేవాళ్ల‌కి క‌రివేపాకు ప్రాముఖ్య‌త తెలిసుండ‌దు. తెలిసిన వాళ్లెవ‌రూ అలా చేయ‌రు. వంట‌ల్లో వేసుకునే క‌రివేపాకే కాకుండా చెట్టు మీద ఉన్న ఆకులు కోసుకొని తింటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ర‌క‌ర‌కాల వంట‌ల‌కు ఉప‌యోగించే క‌రివేపాకు వ‌ల్ల క‌లిగే లాభాలు తెలుసుకోవ‌డం ముఖ్యం. ఇందంతా చదివిన తర్వాత కూడా మీరు ఇదే మాట మీద ఉంటారో లేదో చూద్దాం. తప్పకుండా మీరు నిర్ణయం మార్చుకోవడమే కాదు.. పచ్చి ఆకును కూడా నమిలేస్తారు. మరి, కరివేపాకు వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ ప్రయోజనాలేమిటో చూసేద్దామా!

Also Read: కొత్తిమీరలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

Health Benefits Of Curry Leaves, Medicinal Uses Of Curry Leaves - Parentcircle

కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలో

  • కరివేపాకు జీర్ణాశయ సమస్యలను నియంత్రింస్తుంది.
  • విరేచనాలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా కరివేపాకును తీసుకోండి.
  • శరీరంలోని అనారోగ్యకరమైన కొవ్వును తగ్గిస్తుంది. కాబట్టి గుండెకు మేలు జరుగుతుంది. బరువు కూడా తగ్గొచ్చు.
  • కరివేపాకులోని లాక్సేటివ్ లక్షణా మలబద్దకాన్ని నివారిస్తాయి.
  • మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలను కరివేపాకు నియంత్రిస్తుంది.
  • పేగులు, పొట్ట కండాలను బలోపేతం చేయడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది.
  • క్యాన్సర్ ప్రేరేపితం కారకాలను కరివేపాకు నియంత్రిస్తుంది. కాబట్టి.. కరివేపాకు నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే క్యాన్సర్ భయం ఉండదు.
  • కరివేపాకులో ఉండే కార్బోజోల్ ఆల్కలాయిడ్ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది.
  • శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్‌లకు గురి కాకుండా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
  • డయేరియాను కరివేపాకు నయం చేస్తుంది.
  • ఫుడ్ పాయిజనింగ్‌ సమస్యను కరివేపాకు తగ్గిస్తుంది.
  • చెమట, శరీర దుర్వాసనను కూడా కరివేపాకు నివారిస్తుంది.

  Also Read: గోరువెచ్చని నీరు తో ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు