flu shot help kids

Flu Vaccine : కరోనా తొలి రెండు దశల్లో వృద్ధులు, యువతపై కరోనా పంజా విసరటంతో కాస్త తట్టుకోగలిగాం. కానీ, మూడో దశలో పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంటున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన రెట్టింపు అవుతున్నది. ఈ ఆందోళనల మధ్య కాస్త ఉపశమనం పొందే విషయాన్ని చెప్పారు చిన్నపిల్లల వైద్యనిపుణులు. ఫ్లూ టీకాతో పిల్లల్లో కరోనాకు చెక్‌ పెట్టవచ్చని చెప్పారు. టీకాలు సక్రమంగా తీసుకొనే పిల్లల్లో వైరస్‌సోకే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని, వైరస్‌ సోకినా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వరకూ వెళ్లే అవసరం రావటం లేదని చెప్తున్నారు.

ఫ్లూ టీకా తో ఎలా ?

కరోనా టీకా, ఇన్‌ఫ్లుయెంజా టీకాలకు సంబంధించిన ‘ఎపిటామిమోలాజిక్‌’ క్లినికల్‌ ఫీచర్లు దాదాపుగా ఒకేరకంగా ఉన్నట్టు వైద్యశాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఫ్లూ టీకాలు ఇప్పించటం వల్ల విపత్కర పరిస్థితుల్లో పిల్లలపై వైరస్‌ తీవ్రరూపం దాల్చకుండా, ప్రాణాంతకం కాకుండా కాపాడుతుందని వైద్యనిపుణులు తెలిపారు. ఫ్లూ వ్యాక్సిన్‌(Flu Vaccine) ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుందని, ఇది కరోనా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు.

 flu shot help kids

చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలు వివిధ రకాల వ్యాధులు, వైరస్‌లకు సంబంధించిన యాంటిబాడీలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పిల్లలకు వైరస్‌లు, అంటువ్యాధులు సోకకుండా రక్షణ కల్పిస్తాయి. బీసీజీ, ఫ్లూ సంబంధిత టీకాలు తీసుకున్న పిల్లల్లో కరోనా వైరస్‌ ప్రభావం స్వల్పంగా ఉంటుందనేది ఒక థియరీ అని అంటున్నారు నిలోఫర్‌ వైద్యనిపుణులు. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెంజా టీకా వైరస్‌లు సోకకుండా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్‌తో కరోనాను వందశాతం అడ్డుకోకపోయినప్పటికీ టీకా వల్ల ఉత్పత్తి జరిగే యాంటిబాడీస్‌ వల్ల వైరస్‌ తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకుంటుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు.

పిల్లలకు షెడ్యూల్‌ ప్రకారం టీకాలు ఇప్పించాలి. టీకాలతో వాళ్లలో యాంటిబాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. ఫ్లూ టీకా వల్ల కరోనా సోకదని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. అయితే, వైరస్‌ సోకే అవకాశాలు తక్కువ. షెడ్యూల్‌ ప్రకారం టీకాలు ఇస్తే పిల్లల్లో ఆయా వ్యాధులు, వైరస్‌లకు సంబంధించిన యాంటిబాడీస్‌ ఉత్పత్తి జరిగి వాటి నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తాయి. సాధారణంగా మే చివర నుంచి జూన్‌ మొదటి వారం మధ్యలో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్‌ ఇవ్వటం మంచిది. దీనివల్ల ఉత్పత్తయ్యే యాంటిబాడీస్‌ ఇన్ఫెక్షన్లను అడ్డుకొనే అవకాశముంటుంది.

Also Read : మీ చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెంచండి ఇలా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *