Fruits for diabetes patients : షుగర్ మనకు తెలియకుండానే మన ఒంట్లో పేరుకుపోయి ఒక్కసారిగా బయటపడి భయపెడుతుంది. ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధపెడుతున్న వ్యాధి షుగర్. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీన్ని పూర్తిగా నివారించే మందు మనకు అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్‌ను నియంత్రించవచ్చు. షుగర్‌తో బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి రాగానే ఆహారం విషయంలోచాలా అనుమానాలుంటాయి. పండ్లు తిందామంటే… ఏవి తినాలో, ఏవి తినకూడదోనన్న సంశయం వెంటాడుతుంది. అలాంటి వారు ఈ ప్రూట్స్‌ని ఏమాత్రం భయంలేకుండా తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నేరేడుపండ్లు.. ఈ పండ్లని తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్లో ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. కేవలం ఈ పండ్లే కాదు.. వీటి గింజలను పౌడర్ చేసుకుని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది.

జామపండ్లు..విటమిన్ ఎ, సి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లు మధుమేహులకు చాలా మంచివి.

ఫిగ్(అంజీర్).. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అంజీరా పండ్లు ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లని తీసుకోవచ్చు.

ఆపిల్స్.. యాపిల్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. కాబట్టి మధుమేహులు ఈ పండ్లని తినడం ముఖ్యం.

ద్రాక్షపండ్లు.. రక్తప్రసరణను మెరుగుపరచడంలో ద్రాక్షపండ్లు ముందుంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వుశాతం తగ్గుతుంది.

దానిమ్మపండు.. ఈ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి మధుమేహులు ఈ పండ్లను తినొచ్చు.

పుచ్చకాయల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహులకు అంతమంచిది కాదు.. కానీ.. ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు.

విటమిన్ సి కలిగిన పండ్లు డయాబెటిస్ పేషెంట్లకి ఎంతో మంచిది. అందువల్ల కమలా పండ్లు తీసుకోవడం ముఖ్యమే.
Nice