health benefits of amla

ఉసిరికాయని ఇండియన్ సూపర్ ఫుడ్ అని పిలవచ్చు. చిన్న ఆకుపచ్చని కాయలో. డైజెషన్ దగ్గర నుండీ సిల్కీ హెయిర్ వరకూ ఉసిరికాయ చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యనైనా అద్భుతంగా నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువుగా ఉండే పదార్దం ఈ ఉసిరికాయ. ఈ ఒక్క ఉసిరి కాయ రెండు నారింజ పండ్లతో సమానం. ఉసిరికాయ జ్యూస్ వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూస్ ను ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒకే మోతాదులో తీసుకోవడం వల్ల నిజమైన ప్రయోజనాలేంటో మనకు తెలుస్తాయి. మరి ఆ ప్రయోజనాలు మీరు కూడా ఒక సారి తెలుసుకోండి.. ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Also Read: పురుషుల్లో సంతాన సామర్థ్యం పెంచే క్యారెట్!

Amla hair pack to get rid of greasy hair the natural way | India.com

ఉసిరితో హెల్త్ బెనిఫిట్స్

  1. ఉసిరికాయ లో ఉండే విటమిన్ సీ వల్ల ఇన్‌ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి. రెసిస్టెన్స్ పెరుగుతుంది.
  2.  ఇందులో ఉండే లాక్సటివ్ ప్రాపర్టీస్ వలన మలబద్ధకం సమస్య దూరమౌతుంది. ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ని ఉసిరికాయ లో ఉండే ఫైబర్ క్లీన్ చేసేస్తుంది.
  3. డయాబెటీస్ ని కూడా అదుపు చేస్తుందని కొన్ని స్టడీస్ లో తెలుస్తోంది. జీవితకాలాన్ని పెంచుతుందని కూడా కొన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
  4. బాడీలో ఐరన్ కంటెంట్ పెంచుతుంది. తద్వారా ఎనీమీయా రాకుండా ఉంటుంది.
  5. రకరకాల కాన్సర్లకీ, సెల్ డీజెనరేషన్ కీ కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని ఉసిరి కాయ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అడ్డుకుంటాయి.
    జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కో-ఆర్డినేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
  6. బాడీ న్యూట్రియెంట్స్ ని అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది. అంతే కాక శరీరం లో నుండి టాక్సిన్స్ ని ఫ్లష్ ఔట్ చేస్తుంది.
  7. జుట్టు కుదుళ్ళని బలపరిచి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ కి మంచి మందు. ఉసిరికాయ రసం తో మసాజ్ చేస్తే చుండ్రు కూడా పోతుందని అంటారు.
  8. ఆకలి పెంచుతుంది. అన్నం తినమని మారాం చేసే పిల్లలకు ఉసిరికాయ మంచి మందు. పిల్లలకి చక్కని పుష్టినిస్తుంది.

 Also Read: ‘విట‌మిన్ డి’ టాబ్లెట్లు… మోతాదుకు మించితే ప్రమాదం