health benefits of Chaddannam

Chaddannam:  రాత్రిపూట మిగిలిపోయిన అన్నంను చద్దన్నం అని పిలుస్తారు. ఇలా చద్దన్నంను ఇప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఉదయంపూట తీసుకుంటారు. అమ్మో.. చ‌ద్ద‌న్నం తిన‌డం నా వ‌ల్ల కాదు అని చెబుతారు. కానీ ఆ చ‌ద్ద‌న్నం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకున్నారంటే ఇకపై చ‌ద్ద‌న్నం వ‌ద్దు అనే మాట మీ నోట రానే రాదు. ఎందుకంటే ఇటీవ‌ల‌ అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంతో ఎన్ని ర‌కాల లాభాలుంటాయో అధ్య‌య‌నం చేసి మ‌రీ వెల్ల‌డించింది. మ‌రి ఆ లాభాలేంటో మ‌నం కూడా తెలుసుకుందామా..?

Also Read: శీతకాలంలో పెరుగు తినొచ్చా?

Eating Curd Rice Makes You A Happy Person, Seriously! - NDTV Food

అన్నం పులిస్తే ఐరన్, పొటాషియ్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. అందుకే చ‌ద్ద‌న్నంలో ఆ పోష‌కాల పాళ్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుందట. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువ‌గా ల‌భిస్తాయ‌ట‌‌.

చ‌ద్ద‌న్నం తో ప్రయోజనాలు

  • అందుకే చ‌ద్ద‌న్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్‌గా ఉంటుంది.
  • శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా ల‌భిస్తుంది.
  • వేడి కార‌ణంగా శ‌రీరంలో ఉండే దుష్ఫ‌లితాలు తగ్గుతాయి.
  • పీచుద‌నం పెరిగి మల బద్దకం, నీరసం తగ్గిపోతాయి.
  • ర‌క్త‌పోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది.
  • శ‌రీరం ఎక్కువ‌సేపు ఉల్లాసంగా ఉంటుంది. అల‌సిపోదు.
  • అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి.
  • పేగుల్లో అల్సర్ల వంటి ఉంటే కూడా త‌గ్గిపోతాయి.
  • ఎదిగే పిల్ల‌ల‌కు చ‌ద్ద‌న్నం మంచి పౌష్టికాహారం.

Also Read: మలబద్ధకం నుండి ఉపశమనం కోసం ఆరెంజ్ జ్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *